దిశా యాప్ ను 1.52 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 28,585 ఘటనల్లో బాధితులు ఇప్పటి వరకు దిశ సహాయం అందుకున్నారు. దిశా కాల్స్ కోసం 51 మంది పని చేస్తూ 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. 18 దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్స్, 21 మంది పీపీలు, 25 ప్రత్యేక కోర్టులు దిశా కార్యక్రమాన్ని సమర్థవతంగా అమలు చేస్తున్నాయి. 900 వాహనాలు దిశా కోసం పని చేస్తున్నాయి.
P Kranthi Prasanna | Edited By: Surya Kala
Updated on: Nov 10, 2023 | 12:59 PM
ఏపి సర్కార్ విప్లాత్మకంగా తీసుకుని వచ్చిన దిశా యాప్ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతుంది. మహిళల చేతిలో ఆయుధంగా ఆకతాయిల ఆట కట్టిస్తుంది. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ బాధితులు స్వేచ్చగా, నేరుగా ఫిర్యాదు చెయ్యటానికి 24 గంటలు అందుబాటులో ఉన్న దిశా యాప్ నిందితులకు చుక్కలు చూపిస్తుంది. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటం మాత్రమే కాదు నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వెయ్యటంలోను దిశా యాప్ సమర్థవంతంగా ముందుకు దూసుకుపోతుంది. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారు లు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలు, పిల్లలకు న్యాయం చెయ్యటంలో దిశా యాప్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది.