Select your Top Menu from wp menus
Breaking News

ఫ్యాన్‌ని చూసి జగన్‌కు ఆ కల వచ్చిందేమో: యనమల

అమరావతి: టీడీపీ హయాంలో అన్ని రంగాల్లో ముందున్నామని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి అధిక పెట్టుబడులు వచ్చాయన్నారు. టీడీపీ హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుందని యనమల వెల్లడించారు. ఫ్యాన్‌కి 3 రెక్కలు ఉంటాయని, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. విశాఖలో రాజధాని పెట్టాలని ఎవరు అడిగారు? అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లను చూస్తే విశాఖ ప్రజలు భయపడుతున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. ఫ్యాన్‌ని చూసి జగన్‌కు 3 రాజధానుల కల వచ్చిందేమోనని యనమల ఎద్దేవా చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *