Select your Top Menu from wp menus
Breaking News

విశాఖకు సినీ పరిశ్రమ

ఇదే సీఎం జగన్‌ ఆశయం

మంత్రి ముత్తంశెట్టి వెల్లడి

సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాట విడుదల

మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మహేష్‌బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు.  పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్‌ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్‌ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *